ఇంద్రసేన రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ సంఘ ఆధ్వర్యంలో రెపరెపలాడిన ఎర్రజెండా మే డే జెండాను ఎగరవేసిన ఎస్సైరాజు
కంచికచర్ల ..మే ...1.. డ్రైవర్లు మద్యం సేవించి తమ వాహనాలనుఅప్రమత్తంగానడపరాదని కంచికచర్ల ఎస్సై రాజు పేర్కొన్నారు. కార్మికుల దినోత్సవ0 (మేడే)
పురస్కరించుకొని కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల గ్రామంలో ఇంద్రసేన రథసారథి ఎన్టీఆర్ జిల్లా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆయన షేక్ కాజా వేముల సహదేవ రావు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో ముఖ్యఅతిథిగా కంచికచర్ల ఎస్సై పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలత ఇంద్రసేన రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఎస్సై తన చేతులతో ప్రారంభించారు. అనంతరం మేడే జెండాను ఎస్సై ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన ఎస్సై రాజు ఈ సందర్భంగా డ్రైవర్ అండ్ క్లీనర్స్ తో మాట్లాడుతూ ఏ వృత్తి అయినా దైవంతో సమానమని అయితే డ్రైవర్ వృత్తి కూడా సంఘంలో ప్రధానమైనది అన్నారు. డ్రైవర్లు మద్యం సేవించి తమ వాహనాలు నడప రాదు అని ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగితే వారి వెనకాల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఆ కుటుంబాలు వీధిన పడే అవకాశాలు మేoడుగా ఉన్నాయని అందుకు వాహనాలు నడిపే ముందు తగు జాగ్రత్తలతోపాటు ఎటువంటి మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయరాదనిఎస్సై తెలియజేశారు. ఇటీవల పరిటాల గ్రామం నందు డ్రైవర్ కే. నరసింహారావు కు ప్రమాదం వాటిల్లగా వారి స్వగృహానికి వెళ్లి ఆ కుటుంబానికి ఇంద్రసేన రథసారథి అసోసియేషన్ సంఘ నాయకులు షేక్ కాజా వేముల సహదేవరావు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రసేన రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు షేక్ కాజా వేముల సహదేవరావు మాట్లాడుతూ మా డ్రైవర్లకు క్లీనర్స్ కు ఈ సంఘం ఎల్లవేళలా అండగాఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జాయింట్ సెక్రెటరీ దున్న సురేష్ ఉపాధ్యక్షులు వేముల రామారావు ట్రెజరర్ ఎస్ కే జానీ సైదా కమిటీ మెంబర్స్. డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్నారు.