హైదరాబాద్, ఈవార్తలు : సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలపై ఆమే స్వయంగా స్పందించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక.. ఒక వీడియో విడుదల చేసిన కల్పన.. అందులో తాను ఎందుకు స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా వేసుకున్నది వెల్లడించారు. ఆ వీడియోలో.. ‘వార్తల్లో, మీడియాలో నా గురించి నా భర్త గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నా వయస్సు 45 సంవత్సరాలు. ఈ వయస్సులో నేను పీహెచ్‌డీ చేస్తున్నా. నా భర్త సహకారం, ప్రోత్సాహంతో మ్యూజిక్‌లో నేను బిజీగా ఉన్నాను. అనేక పనుల కారణంగా నేను స్ట్రెస్ కు గురయ్యాను. అందుకే నిద్ర సరిగా లేకపోవడంతో నేను కొంచెం ఎక్కువ నిద్ర మాత్రలు వేసుకున్నా. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎలాంటి దుష్ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
కాగా, కేరళలో ఉన్న కూతురు చదువు కోసం హైదరాబాద్ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతోనే కల్పన మనస్థాపానికి గురై మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆమె కూతురు కూడా ఖండించింది. అదే సమయంలో భర్తతో మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మరో వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో కల్పనే స్వయంగా ఒక వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది.
టెర్రరిజం లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్.. తొలి ప్లేస్ ఎవరిదో తెలుసా.!
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!
Hashtags: #crime news #Hyderabad #Singer Kalpana #Tollywood