పెన్షన్ దారుల కళ్ళల్లో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం
News Image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల జులై 1..... ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు నిరుపేదలకు  ఆర్థిక భరోసా అని కంచి కచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల పట్టణ పరిధిలో గల చెరువు కట్ట బజార్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్  మంగళవారం కంచిక చర్ల మార్కెట్ చైర్మన్ కోగంటి బాబువృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంపుదల చేయడమే కాక ప్రతి నెల మొదటి తారీకున పెన్షన్ను ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు వీరిఅందరి కళ్ళల్లో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ టిడిపి అధ్యక్షులు వేమా వెంకట్రావు, క్లస్టర్ అధికారి తడపనేని లక్ష్మణరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పంచాయతీ వార్డు మెంబర్స్, గుత్తా ఓంకార్, గూడవల్లి గణేష్, మండల సమైక్య అధ్యక్షురాలు నల నాగుల అరుణ, వేల్పుల శ్రీనివాసరావు,నంబూరు దుర్గారావు కంచికచర్లపంచాయతీ ఈవో సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు.