రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి సబ్ ఇన్స్పెక్టర్ రాజు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని రౌడీషీటర్లకు, అనుమానస్పద వ్యక్తులకు ఎస్సై ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీపై పోలీసు నిఘా ఉంటుందని, ఘర్షణలకు, పంచాయతీలు, సెటిల్మెంట్లకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో మంచి వాతావరణం కోసం పోలీసులకు సహకరించాలని, రౌడీయిజం చేసినా, ప్రజలను, మహిళలను, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేసి వెళ్ళాలని సూచించారు.