ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వసంత కాలని లో వేంచేసియున్న నాగలక్ష్మిఅమ్మవారి 12 వ వార్షికోత్సవం సందర్భంగా కోగంటి బాబు గారు స్థానిక నేతలు ఆలయ ధర్మకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందచేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నన్నపనేని లక్ష్మీ నారాయణ దంపతులు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.