గుంటూరు పోలీస్ బాధ్యతలు తాత్కాలికంగా తుషార్ డూడీకి..
News Image

గుంటూరు జిల్లా, పోలీస్ వ్యవస్థలో తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్పీ సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని స్వగ్రామానికి వెళ్లారు. వారం రోజుల విశ్రాంతికి వెళ్లిన ఆయన తిరిగి 25న గుంటూరుకు చేరనున్నారు. దీంతో ఇంటర్మీడియట్ గా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు..