ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రజాకవి, ప్రజా వాగ్గేయకారులు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న సోమవారం కవి, రచయిత తంగిరాల సోని ఇంటికి కవులు కోయి కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ తాడీ ప్రకాష్ తో కలిసి రావడం జరిగింది.
మే 18 ఆదివారం కలేకూరి ప్రసాద్ సభ సక్సస్ గురించి మాట్లాడి, తంగిరాల సోని కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది. గోరేటి వెంకన్నకు తంగిరాల సోని కవితా సంపుటి బ్లాక్ వాయిస్ ఇవ్వడం , కొన్ని కవితలు చదివి చాలా బాగున్నాయని చెప్పారు . సాహిత్య కార్యక్రమాలు బాగా జరుపుతున్నావని , మహానీయులు సభలు జరుపుతున్నావని , పుస్తకాలు ముద్రణలు వేస్తున్నావని అడిగి కాసేపు పాటలు, కవిత్వం చర్చ అనంతరం తిరిగి హైదరాబాద్ ప్రయాణమై వెళ్లిపోయారు.