న్యూఢిల్లీ, ఈవార్తలు : సైబర్ నేరగాళ్ల ఆగడాలను అంతులేకుండా పోతోంది. ఇందుకు ఏ సంస్థా అతీతం కాదు. తాజాగా, ఇండియా పోస్ట్ స్కాం india post scam ఒకటి వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజలే టార్గెట్‌గా సైబర్ దొంగలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్ నుంచి మెసేజ్ వచ్చినట్లు కలరింగ్ ఇచ్చి లక్షల్లో కాజేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బోగస్ మెసేజెస్ వస్తున్నట్లు కంప్లెయింట్లు వస్తున్నాయి. ఈ ఫేక్ మెసేజ్ పలు ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.
మోసం చేస్తున్నారిలా..
‘మీ పార్సిల్ వేర్ హౌజ్‌కు చేరింది. డెలివరీ చేసేందుకు మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ, చిరునామా సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తోంది. 48 గంటల్లో మీ అడ్రస్ అప్‌డేట్ చేయండి లేకపోతే మీకు వచ్చిన పార్సిల్ రిటర్న్ చేయబడుతుంది. మీరు అడ్రస్ అప్‌డేట్ చేసేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. చిరునామా అప్‌డేట్ చేశాక 24 గంటల్లో మీ పార్సిల్ మీకు అందుతుంది’ అని ఉంటుంది. నిజమేమో.. మనకు ఎవరైనా పార్సిల్ పంపించారేమో అని చెప్పి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.
లింక్ క్లిక్ చేస్తే..
లింక్ క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. సమాచారం ఇచ్చాక సబ్మిట్ చేయగానే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లాంటి ఫేక్ వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ ఫేక్ ట్రాకింగ్ ఐడీ, డెలివరీ ఫెయిల్ అయినట్లు ఫేక్ నోటీస్ కనిపిస్తుంది. అక్కడ అడ్రస్ అప్‌డేట్ చేయాలని అడుగుతుంది. అడ్రస్ అప్‌డేట్ చేయగానే.. సైబర్ దొంగలు వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తారు. ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతారు.
తస్మాత్ జాగ్రత్త : పీఐబీ
ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే లింక్ క్లిక్ చేయకూడదని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సూచించింది. డీటెయిల్స్ నమోదు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, సబ్మిట్ నొక్కేముందు.. అసలు మీకు పార్సిల్ వచ్చే అవకాశం ఉందా? ఏదైనా పార్సిల్ కోసం మీరు ఆర్డర్ చేశారా? అన్నది నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది.
ఐఏఎస్ అధికారికి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. సినిమాలు తీయడమే కష్టమంటూ వ్యాఖ్య
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!
Hashtags: #crime news #Cyber Crime #India Post