
Mar 2,2025 12:17 వాషింగ్టన్ : మస్క్‌కి వ్యతిరేకంగా అమెరికాలోని టెస్లా కార్యాలయాల ఎదుట ఆందోళనకారులు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ నియమించిన డోజ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరఅమెరికా, ఐరోపాలో ట్రంప్ విధ్వంసకర పాత్రకు పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ప్రదర్శనలు నిదర్శనం. దీనిలో భాగంగా టెస్లా కొనుగోళ్లను అడ్డుకోవాలని, ఆటంకం కలిగించాలని ఆందోళనకారులు భావిస్తున్నారు. శనివారం 50 కంటే ఎక్కువ ప్రదర్శనలు జరిగినట్లు టెస్లా వెబ్ సైట్ పేర్కొంది. ఇంగ్లండ్, స్పెయిన్ మరియు పోర్చుగల్‌లతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని పలు ప్రాంతాల్లో మరిన్ని నిరసనలు చేపట్టనున్నట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. టక్సన్, అరిజోనా సహా సెయింట్ లూయిస్, న్యూయార్క్ నగరం, డేటన్, ఒహియోబీ షార్లెట్, మరియు పాలో ఆల్టో, కాలిఫోర్నియాల్లో ఇటీవల ప్రదర్శనలు జరిగినట్లు వార్తానివేదికలు తెలిపాయి. కొంతమంది టెస్లా యజమానులు తమ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. యూదు సమూహాలు మరియు పరిశీలకులు యూదు వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు.
ఇటీవల ట్రంప్, మస్క్‌లు వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగుల తొలగించడంతో పాటు ఒప్పందాలను రద్దు చేశారు. యుఎస్ఏజన్సీఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌తో సహా ప్రభుత్వ విభాగాలను మూసివేశారు. మస్క్ చర్యలు అమెరికా బడ్జెట్‌ను నియంత్రించడానికి, తన సందపను పటిష్టపరుచుకోవడానికి మార్గాలను అందిస్తున్నాయని, కాంగ్రెస్‌ను ధిక్కరిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మస్క్ ముఖ్యంగా స్పేస్ ఎక్స్, సోషల్ మీడియా ఎక్స్‌లను విస్తరించేందకు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.