వివాహేతర సంబంధాలు అనేకమంది ప్రాణాలను బలి కోరుతున్నాయి. వివాహేతర సంబంధాలు కారణంగా ఏట వందల మంది భార్యలు, భర్తలు మరణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో అత్యంత అపాయకర వైశామ్యాలుగా రూపు దాల్చి.. చివరకు హత్యలకు సైతం దారితీస్తున్న తీరు తీవ్రంగా కలిసి వేస్తోంది. వివాహ బంధం గతంలో ఎన్నడూ లేనంతగా నిత్తురోడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మారిన ధోరణులు దీనికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా మారిన ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో ఏటా 275 మంది భర్తలు, 225 మంది భార్యలు వేరువేరు ఘటనల్లో జీవిత భాగస్వామిల చేతుల్లో హతమవుతున్నారని ఐక్యరాజ్యసమితి అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లు. ఇంత జనాభా ఉన్నచోట ఎన్నెన్నో నేరాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని ఘటనలు ప్రత్యేకంగా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకుంటాయి.
ఈ జాబితాలో భార్యాభర్తల పరస్పర హత్యాకాండలు చేరడం భయాందోళనలకు గురిచేస్తుందని ఐక్యరాజ్యసమిత వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి అందించిన నివేదికను అనుసరించి 2023లో ప్రపంచవ్యాప్తంగా 50 వేలమంది మహిళలు, ఆడపిల్లలు హత్యకు గురయ్యారు. ఇందులో 60 శాతం కేసుల్లో వారిని భర్తలు, సహచరులు, కుటుంబ సభ్యుల హతమార్చారు. సహా భాగస్వామిని చంపిన తరువాత మృతదేహాలను డ్రమ్ముల్లోనూ, ఫ్రిజ్ లోను, సూట్ కేసుల్లోనూ, భూమి అడుగున, మంచం కింద దాచేస్తున్నారు. అనేక సందర్భాల్లో అవశేషాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నారు. ముక్కలు చేసిన శరీర భాగాలను సూట్ కేసుల్లో సర్ది మారుమూల, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ, నీటి కుంటలోనూ పడేస్తున్నారు. దీంతో మీడియాకు ఇటువంటి ఘటనలను రిపోర్ట్ చేయడం ఒక సవాలుగా మారిందని ఐరాసా అధ్యయనం తెలిపింది. ఇటీవల నేరాల నుంచి ఇటువంటి ఉదాహరణలు కొన్ని ప్రస్తావించింది. తాను ప్రేమించిన అనురాగ్ అనే వ్యక్తి కోసం తాను పెళ్లాడిన దిలీప్ ను ప్రగతి అనే యువతి చంపించింది. వారి పెళ్లి జరిగిన 15 రోజులకే ఈ హత్య జరిగింది. వివాహనంతర హిందూ క్రతువులు గంగా తనకు లభించిన నగదును సుఫారీగా ఇచ్చి ప్రగతి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేశను ఐక్యరాజ్యసమితి తన అధ్యయనంలో ప్రస్తావించింది.
ఈ తరహా మరణాలు గడిచిన కొన్నాళ్లుగా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల, ఆడపిల్లల హత్యలు గురించి ఐక్యరాజ్యసమితి అనుబంధ డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు నిర్ధారించింది. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో కడతేరుతున్నారు. 2023 లెక్కలు, 2022లో ఇటువంటి కేసుల్లో ఆఫ్రికాలో అధికంగా నమోదయ్యాయి. ఏడాది తిరిగేసరికి ఆఫ్రికాను ఆసియా రెండో స్థానానికి నెట్టేయడం గమనార్హం. ఈ తరహా కేసుల్లో 58 శాతం హత్య ఘటనలు వివాహ సంబంధంతో ముడిపడి ఉండగా ఇందులో 42 శాతం ఘటనలో పురుషులే బాధితులుగా ఉన్నారు. స్త్రీల విషయంలో కనిపించే లింగ వివక్ష కోణం భారతలో జరుగుతున్న నేరాల్లో పెద్దగా కనిపించడం లేదని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వృద్ధులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీలో కీలక నిర్ణయం.. పూర్వ పద్ధతిలో విఐపి బ్రేక్ దర్శనాలు
విటమిన్లు, ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే..
Hashtags: #crime news #Extramarital Affairs Are Sacrificing Many Lives