Friday, April 4, 2025
spot_img
Homeఆంధ్రప్రదేశ్సెల్ ఫోన్ కి బానిసలవుతున్న యువత…? BHS NEWS

సెల్ ఫోన్ కి బానిసలవుతున్న యువత…? BHS NEWS

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఓ చేయి స్మార్ట్ ఫోన్ పైనే

రోజంతా వీడియో గేమ్ ల తోనే కాలక్షేపం

కంటి చూపు మందగించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిక

తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహారించాలి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : నేటి తరం సాంకేతిక యుగంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సెల్ ఫోన్ వలయంలో చిక్కుకుపోయారు.ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఓ చేయి స్మార్ట్ ఫోన్ పైనే ఉంటుంది షేరింగ్, లైక్ కామెంట్ ఈ క్షణం ఇదే ప్రపంచంగా యువత, పెద్దలు గడిపేస్తున్నారు. డబ్బు లావాదేవీలతో సహా వినోదానికి, కాలక్షేపానికి ఇలా అన్ని అంశాలతో సెల్ ఫోన్ ముడిపడి పోయింది.ఇది ప్రస్తుతం మానవ జీవనశైలిలో సెల్ ఫోన్ ఒక భాగంగా మనుషులందరినీ కట్టు బానిసలుగా మార్చుకుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తనపై ఆదారపడేలా సెల్ ఫోన్ మలుచుకుంది. యువతీ, యువకులు విద్యార్థులైతే అరచేతిలో స్మార్ట్ ఫోన్ల ను పెట్టుకొని ఉదయం నిద్ర లేసిన దగ్గర నుండి రాత్రి పాడుకొనే వరకు పగలంతా సెల్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా రోజంతా వీడియో గేమ్ లతో గడిపేస్తున్నారు.గంటలకొద్దీ అర్ధం పర్ధం లేని చాటింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ సోషల్ మీడియా కు బానిసలైపోతున్నారు.యువత ప్రస్తుతపరిస్థితిల్లో ప్రత్యక్షంగా ఉన్న మిత్రులతో ఆదుకోవడం కంటే ఆన్ లైన్ లో ఉన్న మిత్రులతో ఎక్కువగా గడుపుతున్నారు.సెల్ ఫోన్లు వచ్చినతరువాత మానవ సంబంధాలు తక్కువై హాయ్.. హలో… బాయ్ పలకరింపులతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతపరిస్థితిల్లో ఫోనుకు బానిసలుగా మారి అతిగా ఫోన్ వాడడం, మాట్లాడడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే కంటి చూపు మందగించడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే సెల్ ఫోన్ ల వల్ల చిన్న పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోవచ్చునని రోజులో ఫోన్ ఎంతతక్కువ వాడితే అంత మంచిదని 8 ఏళ్ళ లోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం బెటరని వైద్య నిపుణులు పలు సందర్భాలలో చూసిస్తూ ఉన్నారు.ప్రధానంగా పిల్లలు, యువత పై తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువవడంతో యువత, పిల్లలు ఎక్కువగాబ సెల్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు.

రోజంతా వీడియో గేమ్ లతోనే కాలక్షేపం.

కొందరు సామాజిక మాద్యమాలలో ముందుకెలుతుంటే మరికొందరు వీడియో గేమ్స్ తో కాలం గడిపేస్తున్నారు వీడియో గేమ్ లో లైనమైతే పరిసరాలలో ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా నిమగ్నమైపోతున్నారు. ప్రస్తుతం పబ్జి,ప్రీఫైర్, గన్ షూటింగ్ వంటి పలు రకాల మునిగి ఆత్మ హత్య లవరకు వెళుతున్నారు.సెల్ ఫోన్ ల కారణంగా నెట్ వాడకం కూడా అధికమైంది. గతంలో నెట్ దొరకాలంటే నానా అవస్థలుపడేవారు. ప్రస్తుతం త్రీజీ, పోర్ జీ, ఫైవ్ జీ సేవలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాకేజీలు లభిస్తుండడం నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. యువత చాటింగ్ వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.వాట్సాప్, పేస్ బుక్,ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రాం స్నాప్ చాట్ నుండి మరికొన్ని సామాజిక మాద్యమాలను వినియోగిస్తున్నారు.సామాజిక మాద్యమాలలో అవి ఇవి అని తేడా లేకుండా యువత తమకు నచ్చినట్లు షేర్ చేసుకుంటూ సెల్ ఫోన్ లే లోకంగా కాలం వెల్లదీస్తున్నారు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

పిల్లలు, యువత నిత్యం ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు,ఐ పాడ్ లు, సెల్ ఫోన్ లతో గడుపుతున్నారు ఆ సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగిస్తే కోపంతో ఊగిపోతున్నారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తూ చాటింగ్ కే ప్రాధాన్యమిస్తున్నారు.కొంతమంది అయితే తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తున్నారు.చాలా మంది విజ్ఞానం కోసం వినియోగించకుండా కొత్త పరిచయాలు, కొత్త స్నేహం కోసం సోషల్ మాద్యమాల్లో వెతుకుతున్నారు. అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారి పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని లేకుంటే మనకు తెలియకుండా పిల్లలు అనారోగ్యాల పాలవుతారని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Social Media Auto Publish Powered By : XYZScripts.com