
BSH న్యూస్: నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ ఏప్రిల్ 03
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సిం గ్ రావుపల్లి గ్రామంలో శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఎస్సి సెల్ కన్వీనర్ జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అన్ని రేషన్ షాపులలో అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రెడ్డి ఉపాధ్యక్షుడు గైని సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిరణ్ రమేష్ గౌడ్ యూత్ ప్రెసిడెంట్ అభిషేక్ రేషన్ డీలర్ సతీష్ కుమార్ లక్ష్మణ్ బాగయ్య రిపోర్టర్ మల్లుగొండ నారాయణ సీనియర్ మేటి సుబ్బురి రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.