మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 1,002కి చేరింది. భారీ భూకంపాలతో రెండు దేశాల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. అమెరికా సంస్థల అంచనా ప్రకారం.. మృతుల సంఖ్య 10 వేలకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపాలతో విలవిల్లాడిన రెండు దేశాలకు సాయంగా రష్యా, చైనా తమ సహాయక బృందాలను పంపించింది. భారత్ కూడా ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఆదేశాలతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయ సామగ్రిని అధికారులు ఆ దేశానికి అందజేశారు. ఆపరేషన్ బర్మా పేరుతో సోలార్ ల్యాంప్స్, ఫుడ్ ప్యాకెట్లు, కిచెన్ సెట్స్ తదితర సామగ్రిని మయన్మార్‌కు చేరవేశారు.
అటు.. బ్యాంకాక్‌కు 990 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినా.. ఆ ప్రభావం బ్యాంకాక్ నగరంపై పడింది. ఆ నగరంలో చారిత్రక, ప్రముఖ భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. పలు వంతెనలు కూలిపోయాయి. ఇదిలా ఉండగా, మయన్మార్‌లో మరోసారి ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం అర్ధరాత్రి 4.2 తీవ్రతతో భూమి కంపించిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
Meena Rasi | ఉగాది మీన రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు
విటమిన్లు, ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే..
Hashtags: #Bangkok #Mayanmar Earthquake