నంద్యాల: ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల అదుపులో ఉన్న నందికొట్కూరు చెందిన ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల విచారణ కోసం నిందితుడి మేనమామను స్టేషన్‌కు తీసుకురాగా.. ఆ వ్యక్తి శవమై కనిపించాడు. మృతదేహాన్ని నంద్యాల దవాఖానకు తరలించారు. ఈ ఘటన మిడుతూరు పోలీస్ స్టేషన్లో ఘటన జరిగింది. ఇది లాకప్ డెత్ కావచ్చని, లేక ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు. మరోవైపు.. బాలిక మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 9 నుంచి కృష్ణా నదిలో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఈ నెల 7న పార్క్‌లో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపి, మృతదేహాన్ని దొరకకుండా చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా.. మృతదేహాన్ని కేసీ కెనాల్ గుట్టపై పడేసినట్లు నిందితులు వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణా నదిలో పడేశామని తెలిపారు. వీరికి తల్లిదండ్రులు కూడా సాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కాగా, శుక్రవారమే జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి బాలిక తల్లిదండ్రులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. రూ.10 లక్షల చెక్కు అందజేసి, సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఇప్పటికే బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యం వహించారని నందికొట్కూర్ రూరల్ సీఐ, ముచ్చుమర్రి ఎస్సైని ఇప్పటికే సస్పెండ్ చేశారు.
ఐఏఎస్ అధికారికి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. సినిమాలు తీయడమే కష్టమంటూ వ్యాఖ్య
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!
Hashtags: #Andhrapradesh #crime news #Nandhyal