
పసిపిల్లలు వద్దనుకుంటే – ఊయలలో వేసి రక్షించండి అనే కార్యక్రమాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు.శిరీష ప్రారంభించారు. ఆడ పిల్లలను,ఆరోగ్యంగా లేని,అంగవైకల్యం కలిగిన,అవాంఛిత గర్భం దాల్చిన పసికందులను చెత్త కుప్పల్లోను, ముళ్ళ పొదల్లోనూ పడేయకుండా ఊయలలో వేసి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని,అట్టి పిల్లలను శిశు గృహలో సంరక్షించి,దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు చట్టబద్ధంగా దత్తత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్ అధికారులు, వైద్యులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.