విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్ అతడు.. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వృత్తి.. కానీ, ఓ మహిళ మోజులో పడి ఆమె భర్తనే దారుణంగా హత్య చేయించి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చాడు. వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పార్థసారథి హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నారు. తన భార్య తాటి స్వప్నతో కలిసి కొత్తగూడెంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సార్లాం విద్యాసాగర్‌తో స్వప్నకు 2016లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న పార్థసారథి.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా, తీరు మారని స్వప్న, విద్యాసాగర్.. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి.
పార్థసారథిని హత్య చేస్తేనే తమ వివాహేతర సంబంధం కొనసాగుతుందని కుట్ర పన్నిన స్వప్న, విద్యాసాగర్.. అతడిని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. కొత్తగూడెంకు చెందిన ఓ ముఠాతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి 28న పండగ కోసం భద్రాచలం వెళ్లిన పార్థసారథి తిరిగి 31న విధులకు వెళ్లారు. ఇదే కరెక్ట్ టైం అని భావించిన స్వప్న.. తన ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో విద్యాసాగర్ సుపారీ గ్యాంగ్‌ను అలర్ట్ చేశాడు. వాళ్లు మహబూబాబాద్ దాటాక.. పార్థసారథిని వెంబడించి శనిగపురం శివారులోని బోరింగ్ తడా వద్ద ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. పార్థసారథి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. ఈ కేసు విషయాలను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సుపారీ గ్యాంగ్ పరారీలో ఉందని, వారిని కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
Top 10 CBSE Schools In Hyderabad.. హైదరాబాద్‌లో టాప్ 10 సీబీఎస్ఈ బడ్జెట్ స్కూల్స్ ఇవే..
విటమిన్లు, ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే..
Hashtags: #Badrachalam #crime news #Illicit affair #Mahabubabad #Telangana News