సీబీఐ కేసు నమోదు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు బాఘెల్ పై కేసు నమోదు చేశారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్ధిదారులలో బాఘెల్ కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. బాఘెల్ పై నేరపూరిత కుట్ర, మోసం, ఛత్తీస్ గఢ్ జూద నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 19 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, బెట్టింగ్ యాప్ కుంభకోణంలో బాఘెల్ పాత్ర కూడా ఉందని గతంలో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసుపై భూపేశ్ బాఘెల్ స్పందిస్తూ.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని మండిపడ్డారు.
బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం పాత్ర.. BHS NEWS
RELATED ARTICLES