నిజామాబాద్, ఈవార్తలు : నిజామాబాద్‌లోని నవీపేటలో ఘోరం జరిగింది. బంధువుల వేధింపులు, దుష్ప్రచారం భరించలేక యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లకెళితే.. హెగ్డోలికి చెందిన అనిల్ (28), శైలజ (24) దంపతులు. వీరికి బంధువుల నుంచి వేధింపులు ఎదురు కావటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని, బంధువుల వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నామని వీడియో తీసి కోటగిరి ఎస్సై సందీప్‌కు వాట్సాప్ చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీడియో వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు.. నవీపే, బాసర గోదావరి ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెతగ్గా, మిట్టాపూర్ శివారులో రైల్వే ట్రాక్‌పై వారిద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఐఏఎస్ అధికారికి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. సినిమాలు తీయడమే కష్టమంటూ వ్యాఖ్య
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!
Hashtags: #crime news #Nizamabad News #Telangana News