ఈవార్తలు, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. పోలీసుల ముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై వివరణ ఇస్తున్నారు. పోలీసులు శ్యామలను పలు ప్రశ్నలు సంధించి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ప్రమోషన్ కోసం ఎంత తీసుకున్నారు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై నిషేధం ఉందన్న విషయం మీకు తెలియదా? నేరానికి శిక్ష ఏంటో తెలుసా? తదితర ప్రశ్నలను సంధించనున్నారు. కాగా, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో శ్యామల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే, విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీసుల ఎదుట శ్యామల హాజరయ్యారు.
మరోవైపు, గడచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై రచ్చ జరుగుతోంది. వివిధ యాప్లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం తాజాగా సినీనటులపైకి వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది అమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న నటులపై మాత్రమే కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజా ఫిర్యాదుతో అగ్ర నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో చిక్కుకున్నట్టు అయిందని పలువురు పేర్కొంటున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపికృష్ణ, ప్రభాస్ చైనీస్ బెట్టింగ్ యాప్ అయినా ఫన్ -88 ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. యాప్ నిర్వాహకులు మ్యూల్ ఆధార్ నెంబర్లతో వారికి తెలియకుండానే ఖాతాలు ద్వారా కోట్లాది రూపాయలను చైనాకు తరలించారని వివరించారు.
తెలంగాణ బిజెపికి కొత్త బాస్.. రేసులో పలువురు నాయకుల పేర్లు.!
తెలుగింటి అందం.. చాందినీ చౌదరి సొంతం
Hashtags: #Betting app Promotion #crime news #Telangana News