జేసీఐ వాల్తేరు సేవలు ప్రశంసనీయం: గంట్ల
ఎన్‌ఎడి కొత్తరోడ్డు, మార్చి30:
నిరాశ్రయలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజంతో ప్రతి ఒక్కరిపైనా ఉందని నేవల్ డాక్‌యార్డు అసోసియేషన్(కెటిబి) గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం ఇక్కడ 90వ వార్డు బుచ్చిరాజు పాలెంలో పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రంలో జేసీఐ వాల్తేరు యూనిట్ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను శ్రీనుబాబు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ నిరుపేదలకు సహయం చేసేందుకు జేసీఐ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ఉమ్మడి విశాఖలో అనేక ప్రాంతాల అభివృద్ధిలో జేసీఐ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జేసీఐ వాల్తేరు అధ్యక్షులు వేముల శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తమ యూనిట్ సభ్యుల ద్వారా తెలుసుకుని ఈ కేంద్రానికి తమ సంస్థ ద్వారా ఆర్వో ప్లాంట్‌ను ఉగాది రోజు అందజేశామన్నారు. అలాగే అరకు ప్రాంతంలో చప్పిడి గ్రామంలో కూడా మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను జెవిఎన్ అనిల్‌కుమార్ జ్ఞాపకార్థం కౌసల్య ఏజెన్సీ అందజేయడం జరిగిందన్నారు. మమతా చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ వసతి కేంద్రంలో నిరాశ్రయలకు గంట్ల శ్రీనుబాబుతో పాటు జేసీఐ సభ్యులంతా మిఠాయిలు పంపిణీ చేశారు. జెసీఐ కార్యదర్శి కెఎన్‌వి కృష్ణ, గౌరవ అతిధి సిద్దికి, ప్రత్యేక ఆహ్వానితులు రూపా సరిపురి, దీలిప్ కుమార్, మిత్ర తేజా, సింధూష తదితరులు పాల్గొన్నారు.
Related