దేశ వ్యాప్తంగా మావోయిస్టులను వేరువేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహిస్తోంది. గడిచిన కొద్ది నెలల్లోనే వందలాదిమంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా చతిస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం ఈ అభయారణ్యం తుపాకులు మాతతో మారు మోగింది. సుక్క జిల్లాలోని ఒపం పల్లి లోని గోగొండ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు హ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. సుక్మా చరిత్రలోనే భద్రతా దళాలకు ఇది భారీ విజయంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇంకా ఎదుర్కొల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉండడంతో ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా దళాలకు సమాచారం రావడంతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని సుక్మా ఎస్పి పర్యవేక్షిస్తున్నారు. భారీగానే మావోయిస్టులు చనిపోయి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు గంటల పాటు ఈ కాల్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. శనివారం సాయంత్రానికి ఈ కాల్పుల్లో ఎంతమంది మృతి చెందారన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గడిచిన మూడు నెలల్లో 100 మందికి పైగా మావోలు మృతి..
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరు వేయడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని అనేక అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులను జల్లెడ పడుతోంది. ఇందుకోసం ప్రత్యేక బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఆయా బలగాలో మావోయిస్టుల ప్రబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గడచిన మూడు నెలల్లో ఇప్పటివరకు అనేక చోట్ల మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎప్పటి వరకు 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఆపరేషన్ కగారులో భాగంగా భద్రత దళాలు ఈ ఎన్ కౌంటర్లకు పాల్పడ్డాయి. తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్ మరో రెండు మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు 20 మందికి పైగా మావోయిస్టులు హతమైనట్లు సమాచారం ఉంది. అయితే అధికారికంగా భద్రతా దళాలు వెల్లడించేంతవరకు దీనిపై స్పష్టత రాకపోవచ్చు. ఈ మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. 5జీ సేవలు ఇక ప్రారంభం
విటమిన్లు, ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే..
Hashtags: #crime news #Huge Encounter At Chhattisgarh