విశాలాంధ్ర.విజయనగరం జిల్లా.సంతకవిటి/రాజాం.
ప్రకృతి వ్యవసాయం సంతకవిటి మండలం గోవిందపురం పంచాయతీలో రైతుల కు ఘన జీవ అమృతం తయారీ చేసే విధానాన్ని యూనిట్ ఇన్చార్జ్ పాత్రుని వెంకటరమణ ఐ సి ఆర్ పి ఝాన్సీ ప్రయోగాత్మకంగా చేసి వివరించడం జరిగింది. రైతులు డిఏపి యూరియా బదులు సేంద్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేయాలని ఘనజీవి అమృతం తయారీకి 100 కేజీల పేడ రెండు కేజీల బెల్లము రెండు కేజీల శెనగపిండి ఆవు మాత్రం 10 లీటర్లు పుట్టమన్ను అన్ని బాగా కలిపి ఉండలుగా తయారు చేసి వారం రోజులు నీడలో ఆరపెట్టితే ఘనజీవము మొత్తం తయారవుతుంది ఆరు నెలల వరకు నిలవ ఉంటుంది ఇవి నేలలో వేసుకుంటే సూక్ష్మజీవులు వానపాములు ఎర్రలు బ్యాక్టీరియాస్ పంటకు కావలసిన పోషకాలు బాగా లభిస్తుందని వాటి ఆధారంగా డిఏపి యూరియా వాడకని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు పెట్టుబడులు తగ్గుతాయి ఉత్పత్తులు పెరుగుతాయి మార్కెట్లో వీటికి మంచి ధర ఉందని రైతులకు వివరించడం జరిగింది.
వీటితోపాటు రైతులు నవధాన్యాలు సాగు ఎకరాకు 12 కేజీలు చొప్పున జీలుగా పప్పు దినుసులు నూనె గింజలు సుగంధ ద్రవ్యాలు తీగజాతి దుంప జాతి ఆకుకూరలు మొదలైనవి విత్తనాలు కలుపుకొని ఖరీఫ్ సీజన్లో వేసుకోవాలి.
The post ఘనజీవమృతం ఘనమైన ఎరువు appeared first on Visalaandhra.