
అమరావతి :ఏపీలో టీడీపీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వస్తోంది. మొత్తం 218 ఏంఎసీల్లో తొలి విడతగా గత నెల 28వ తేదీన 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తిచేసేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నారు