Friday, April 4, 2025
spot_img
Homeతెలంగాణఎల్లారెడ్డి పేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు...

ఎల్లారెడ్డి పేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్..

ప్రభుత్వ విప్ కామెంట్స్

కేటీఆర్ ఈమధ్య సిరిసిల్లకు అమావాస్యకు పున్నంకి వస్తూ మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు..

ఈ రోజు వారు మాట్లాడినా మాటలు చుస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..

పడవబడ్డ మల్కపేట ప్రాజెక్టు నుంచి మీ నియోజకవర్గoలో ఎల్లారెడ్డిపేటకు 0.2 టీఎంసీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం..

కాలేశ్వరం ఉండి ఉంటే కెసిఆర్ నీళ్లు వదిలిపెడుతుండే దేవుని గుట్ట వరకు నీళ్లు పోతుంది అని కేటీఆర్ మాట్లాడిన మాట శుద్ధ అబద్ధం..

మీ హయాంలో మలకపేట రిజర్వాయర్ నుండి చుక్క నీరు దేవుని గుట్ట వరకు కాదు కదా కింది వరకు కూడా విడుదల చేయలేదు..

మీ హయంలో మల్కపేట్ రిజర్వాయర్ పనులు చేసినా వారికి 11 కొట్లు బకాయిలు పెడితే మేము విడుదల చేశాం..

చిల్లి గవ్వ ఇవ్వకుంటే మోటార్లు ఆన్ చేయమంటే వాళ్లను మేము డబ్బు ఇప్పించే ఏర్పాటు చేసి మంత్రితో మాట్లాడి నీళ్లు ఏర్పాటు చేశాం..

మాకు రైతుల పై చిత్త శుద్ధి ఉంది..

కేటీఆర్ ఏదో శుభకార్యానికి వచ్చి రైతులతో మాట్లాడి రైతులపై ముసలి కన్నీరు కాలుస్తున్నారు..

మేము చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదు..

టీ స్టాల్ విషయంలో కేటీఆర్ బొమ్మ ఉంటే ఎన్నికల కోడ్ సమయంలో మీరు తప్పు అనవలసింది పోయి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.

ఎలక్షన్ కోడ్ సమయంలో మహనీయుల విగ్రహాల కు కూడా ముసుగు వేస్తున్నారు..

మీ హయాంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా దోచిపెడితే వాటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతుంది..

పట్నంలో నేను దోచుకుంటా పల్లెల్లో మీరు దోచుకోండి అన్న చందాన కేటీఆర్ మాట్లాడిన తీరు ఉంది..

కెసిఆర్ అంటే మీరు కాళేశ్వరం అంటున్నారు కానీ అది కుళేశ్వర్ రావు అయ్యింది..

పర్రె పగిలిన కాలేశ్వరం నుంచి నీరు ఇవ్వమంటున్న మీరు అది పర్రె పడ్డదని ఒప్పుకున్నారు కదా..

నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి ఇప్పుడు ప్రాజెక్టులో చుక్క నీరు కూడా ఆపదని చెప్పారు..

ఒకవేళ నీటిని ఆపే ప్రయత్నం చేస్తే డ్యాం మొత్తం కూల్ పోతుందని అధికారులు చెప్పారు..

ఆ ప్రాజెక్టులోని నీళ్ళు సముద్రంలో కలిసింది అది మీ పాపాన మూలాన..

కాళేశ్వరం చుక్క నీరు వాడకుండా అనాడు కాంగ్రస్ కట్టిన ప్రాజెక్టులతో 1.50 వేల మెట్రిక్ టన్నుల వడ్లను వానాకాలంలో రైతులు పండించారు..

అప్పర్ మానేరుకు అర టీఎంసీ నీటిని విడుదల చేయడం జరిగింది..

10,11,12 ప్యాకేజ్ ద్వారా చెరువులకు నీటిని నింపడం జరిగింది..

కేటీఆర్ హైదరాబాద్ వెళ్లేటప్పుడు ఒకసారి జిల్లెల్ల ప్రాంతంలో ఆగి చూడు చెరువులకు నీరు వస్తున్నాయి..

ఎల్లారెడ్డిపేట ప్రాంతంగం రైతులకు మొదటి దశలో 0.2 టీఎంసి నీటిని విడుదల చేశాం..

మళ్లీ ఈరోజు సాయంత్రం మంత్రులతో , ఈఎన్ సి, అధికారులతో మాట్లాడడం జరిగింది..

25 లక్షల రైతు కుటుంబాల ఏకకాలం రుణమాఫీ చేసాం..

రైతులకు రుణ మాఫీ చేసినా ప్రభుత్వం మాది..

మొదటి సంవత్సరంలో రైతులకు సుమారు 55 వేల కోట్లు వివిధ రూపాలలో అందజేయడం జరిగింది..

మీలాగా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో 44 కిలోలు జోకి రైతులను దోపిడీ చేయలేదు..

గతంలో మీరు వేములవాడ ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రైతులు రోడ్లు ఎక్కాక నిరు విడుదల చేసేవారు..

మేము రైతులపై చిత్తశుద్ధితో రైతులు రోడ్లు ఎక్కక ముందే నీటిని విడుదల చేస్తున్నాం..

పదో ప్యాకేజ్ 11 ప్యాకేజ్ చేసుకున్నారు కానీ మీ నిర్వాహకం వల్లే ప్యాకేజ్ 9 ఇంకా పూర్తి కాలేదు..

మీ బామ్మర్ది మీ నాన్న వాళ్ళ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకువెళ్తున్నారు….

మీ నిర్లక్ష్యం వల్ల పడవ పడ్డ ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తున్నాం..

మీ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు మీరు బిల్లు చెల్లించకుంటే మేము చెల్లిస్తున్నాం..

సింగసముద్రంలోకి నీటిని తీసుకెళ్లి అక్కడినుండి మోటార్లతో అప్పార్ మానేరుకు నింపే ప్రయత్నం చేస్తున్నాం..

మీ ప్రభుత్వ హయాంలో కాలేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Social Media Auto Publish Powered By : XYZScripts.com